AP: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలోని రామాలయంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు X వేదికగా పోస్ట్ చేశారు. రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించిన నమూనాను పోస్టులో పెట్టారు. ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో డా.ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కనీసం 8 శతాబ్ధాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం చేపడతామని వెల్లడించారు.