VZM: వైసీపీ బలోపీతానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని బొబ్బిలి వైసీపీ ఇంఛార్జ్ జగన్నాథం పిలుపునిచ్చారు. స్దానిక పార్టీ కార్యాలయంలో నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం ఐక్యంగా పని చేయాలన్నారు.