SRD: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి నేడు తెలిపారు. చౌకాన్పల్లికి చెందిన గణపతి(32) గత శుక్రవారం తన మేకల షెడ్డు వద్ద మద్యం మత్తులో పురుగుల మందు సేవించాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదుకు కేసు నమోదయింది.