VSP: భారత్ సమాజ్ డెవలప్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం కంచరపాలెంలోని జాతీయ కార్యాలయంలో జరిగింది. పలు అంశాలపై చర్చించిన అనంతరం రానున్న కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయాలని నిర్ణయించింది. పార్టీకి ప్రస్తుతం సింబల్ లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది.