చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆహార శుద్ధి రంగ అభివృద్ధికి సమన్వయం అత్యంత అవసరమని సూచించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ సౌత్ జోన్ ఛైర్మన్గా రెండోసారి ఎన్నికైన కట్టమంచి బాబీని సత్కరించారు. పరిశ్రమలు, రైతుల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తలుపులపల్లి బాబురెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.