KDP: కమలాపురం మండలం సంబటూరు గ్రామంలో నిర్వహించిన గంగమ్మ జాతరలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.