మెదక్ జిల్లాలో ఎవరైనా క్రికెట్ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డివి. శ్రీనివాస రావు హెచ్చరించారు. ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.