MDK: మెదక్ పట్టణానికి చెందిన ప్రధానోపాధ్యాయులు, సినీగేయ రచయిత సాయిసిరికి రాష్ట్రస్థాయి గురుబ్రహ్మ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన సాయిసిరికి మదర్ థెరిసా సామాజిక సేవ సంస్థ విశాఖపట్నం వారు తెలుగు సాంస్కృతిక గీతాలను రాసి తెలుగు భాష సంస్కృతిక వైభవ వారధిగా నిలిచినందుకుగాను 2026 సంవత్సరం గురుబ్రహ్మ ఉగాది సాఫల్య పురస్కారం అందించారు.