TG: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుపై చర్చలో MLA పాయల శంకర్ కీలక సూచనలు చేశారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం బాధాకరమని, కుమారుల జీతం నుంచి 15శాతం మొత్తాన్ని తప్పనిసరిగా వసూలు చేసేలా చట్టంలో మార్పులు చేయాలని కోరారు. అనాథాశ్రమాలు పెరగడం సామాజిక విలువల పతనానికి సంకేతమని పేర్కొన్నారు. ఈ బిల్లు వృద్ధులకు భరోసానిస్తుందని పేర్కొంటూ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.