GNTR: పొన్నూరులో సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ 4వ మహాసభ నిర్వహించారు. అధ్యక్షుడు ఆరేటి రామారావు అధ్యక్షతన జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, పుప్పాల సత్యనారాయణ బుజ్జి పాల్గొన్నారు. కార్మిక చట్టాలను కాపాడాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు బలోపేతం చేసి బీమా, ఎక్స్గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.