GNTR: మంగళగిరి మండలంలో ఆదివారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకుడు నితిన్ నబిన్ పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.