BDK: ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా చూడాలని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య కోరారు. ఇవాళ జిల్లా కలెక్టర్ అంకిత్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని ప్రజా సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై వీరిద్దరూ చర్చించారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రత్యేక చర్యల గురించి కలెక్టర్‌కు వివరించారు.