KMM: అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇవాళ ఎర్రుపాలెం మండలం రాజుల దేవరపాడు గ్రామానికి చెందిన గురువారెడ్డి, సకినవీడు గ్రామ శివార్లలోని పెద్ద వంటకాలు ప్రాంతంలో గల మర్రి చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.