NLG: మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామానికి చెందిన ఉగ్గిడి శివకుమార్ యాదవ్కు ప్రమాదం జరిగి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజానాయకుడు పాండురంగారెడ్డి నిమ్స్ ఆసుపత్రికి ఆదివారం వెళ్లి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిడి మణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.