KDP: డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని వెంటనే అమలు చేయాలని మాజీ ఎంపీ తులసి రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఆ మాట తప్పిందని మాజీ ఎంపీ విమర్శించారు.