NLG: కనగల్కు చెందిన కంబాల శివలీల, న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఉగాది సేవా పురస్కారం అందుకున్నారు. రవీంద్రభారతిలో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, డా. చక్రవర్తి, రిటైర్డ్ జడ్జి మాల్యాద్రి తదితరుల చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.