AKP: పాయకరావుపేట పట్టణం శాంతి నగర్లో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ మహేశ్వర రావు మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా అందరూ సోదర భావంతో ఉండాలన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.