TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత కరీంనగర్లో పార్టీ నేతలతో సమావేశమై, అనంతరం గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటి ముఖ్య నేతలతో కలిసి జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్తారు. జీవన్ రెడ్డి BRSలో చేరికపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.