SRPT: వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. చివ్వెంల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించి, రోజుకు రూ.600 చెల్లించాలన్నారు. కూలీలకు వేసవి భత్యం అందించడంతో పాటు పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు.