ASR: ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పాడేరులో పర్యటిస్తారని ఎమ్మెల్సీ కార్యాలయం వర్గాలు మంగళవారం తెలిపారు. ఎమ్మెల్సీ గ్రీష్మ పర్యటనలో భాగంగా బుధవారం పాడేరు మండలంలోని గుత్తులపుట్టు గ్రామంలో జరగనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఏఎంసీ ఛైర్మన్లు, ఇన్ఛార్జులు పాల్గొనాలన్నారు.