ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున లేఆఫ్స్‌కు తెరలేపింది. సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే సంబంధిత ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపించింది. ముందస్తు సమాచారం లేకుండానే ‘మీ స్థానం తొలగించబడింది’ అంటూ ఇమెయిల్స్ వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.