NLG: దామచర్ల బీసీ గురుకుల పాఠశాలలో భోజన నాణ్యతపై ప్రశ్నించిన చిన్నారులను ప్రధానోపాధ్యాయురాలు మోకాళ్లపై కూర్చోబెట్టి, భోజనం ఇవ్వకుండా అవమానించడం అత్యంత దారుణమని న్యాయవాది కట్ట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేశారు.