AP: గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. SMలో వచ్చిన వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెంది ఒకేసారి 5 లక్షల గ్యాస్ సిలిండర్లను బుక్ చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ఇంధన నిల్వలు మెరుగ్గా ఉన్నాయని, ప్రస్తుతం 17 రోజులకు సరిపడా గ్యాస్, ఆయిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.