PPM: రిజర్వేషన్లపై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలన చేయాలని క్రిస్టియన్ రైట్ ప్రొటెక్షన్ సమితి గురువారం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. దళిత, క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారు డీఆర్ఓ హేమలతకు వినతి పత్రాన్ని సమర్పించారు. అందరం అన్నదమ్ముల్లాగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి తీర్పు సరికాదన్నారు.