‘ధురంధర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే, ఈ సినిమా తన కథను కాపీ కొట్టి తీశారంటూ సంతోష్ కుమార్ అనే వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. అప్పటి వరకు దర్శకుడు ఆదిత్యధర్పై ఎలాంటి ఆరోపణలు చేయరాదని ఆదేశించింది.