JN: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జనగామ జిల్లా అధ్యక్షులుగా కట్ల సదానందం నియమింపబడ్డారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలని మల్లన్న సదానందంకు సూచించారు.