TG: సీఎం రేవంత్ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై CSR నిధుల వినియోగంపై చర్చించారు. ఈ నిధులను ఖర్చుగా కాకుండా సమాజాభివృద్ధిలో భాగస్వామ్యంగా చూడాలని కోరారు. ముఖ్యంగా స్థానిక అభివృద్ధి, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యాభివృద్ధికి రహేజా, రాంకీ సంస్థలు చెరో రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు కేటాయించినట్లు సీఎం వెల్లడించారు.