MNCL: జైపూర్ మండలంలోని రామారావుపేట గ్రామంలో గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నవీన్, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 66 బైక్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆస్తి సంబంధిత నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.