WGL: వరంగల్ నగరంలోని మట్టెవాడలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ సృష్టించి పోలీసులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 5న ఓ బార్లో క్యాతం రంజిత్, శ్యామల సాయిరాం అతిగా మద్యం సేవించి వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా, విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్, ఎస్సైపై దాడి చేసినట్లు సమాచారం. వారిపై కేసు నమోదు చేశారు.