MHBD: తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన ఇవాళ కలెక్టర్ స్నేహ శబరిష్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో వరిసాగు చేస్తున్న రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.