TG: డీలిమిటేషన్ వల్ల చిన్న రాష్ట్రాలకు అన్యాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే గాయపడి ఉన్నాయన్నారు. ఇంకా అన్యాయం చేస్తామంటే తిరగబడతాయన్నారు. డీలిమిటేషన్ పార్టీల సమస్య కాదు.. ప్రాంతాల సమస్య అని చెప్పారు. దీనిపై ఇండియా కూటమి పార్టీలతో చర్చిస్తామన్నారు. పెద్ద, చిన్న రాష్ట్రాల మధ్య సీట్ల వ్యత్యాసం వివక్షకు దారితీస్తుందన్నారు.