AP: రాష్ట్రంలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండ.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇవాళ 66 మండలాల్లో తీవ్ర వడగాలులు, 79 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. SKLM, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, KKD, తూ.గో. ఏలూరు, NTR జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించింది.