MDCL: ఉప్పల్ నుంచి చిల్కానగర్కు వెళ్లే ప్రధాన రోడ్డుపై డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా మారాయి. ఎక్కడికక్కడ మురుగు నీరు రోడ్డుపై పొంగిపొర్లుతూ దుర్వాసన వ్యాపిస్తోంది. ఈస్ట్ బాలాజీ హిల్స్, హేమ నగర్ సహా అనేక చోట్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.