TG: డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించనున్నారు. ఐబీ కాలనీలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సాయుధ దళాల అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన పోలీస్ క్వార్టర్స్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.