BDK: పాల్వంచ కేటీపీఎస్‌లో సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు మద్దతు పలికేందుకు బయలుదేరిన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ ఖమ్మం నుంచి బయలుదేరిన పలువురు ఉద్యోగ సంఘం నేతలను జూలూరుపాడులోని సాయిబాబా ఆలయం వద్ద అడ్డుకుని స్టేషన్‌కు తరలించినట్లు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై రవి తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు అన్నారు.