GDWL: జిల్లా కార్మిక శాఖలో అవినీతి రాజ్యమేలుతోందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని CITU జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. ఆదివారం ఉండవెల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మిక శాఖ అధికారుల అక్రమాల వల్ల నిజమైన కార్మికులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.