MDCL: భరత్ నగర్ అంగన్వాడీ సెంటర్లో పి & జి ప్రథమ్ ఆధ్వర్యంలో పాఠశాల సంసిద్ధత మేళా నిర్వహించారు. సూపర్వైజర్ సుధా కీర్తి ముఖ్య అతిథిగా హాజరై, ఐదు అభివృద్ధి అంశాల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఆటలు, పాటలు, ప్రదర్శనలతో ఆకట్టుకోగా, రిపోర్ట్ కార్డులు అందజేసి నర్సరీ నుంచి 1వ తరగతికి ప్రమోషన్లు ఇచ్చారు.