TG: జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. జీవన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు BRSలో చేరారు. సభా ప్రాంగణమంతా కేసీఆర్ నినాదాలతో మార్మోగుతోంది.