MNCL: వ్యక్తి జేబులో నుంచి రూ.1 లక్ష దొంగిలించిన నిందితుడిని చెన్నూరు పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. పెద్దపల్లికి చెందిన వెంకటేష్ ఫిర్యాదు మేరకు సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను పరిశీలించి, మందమర్రికి చెందిన అంజనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు.