IPLలో భాగంగా ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన MI, CSK జట్ల మధ్య రేపు హైవోల్టేజ్ పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. వరుస ఓటములకు గత మ్యాచ్‌తో చెక్ పెట్టిన ముంబై.. హోంగ్రౌండ్లో చెన్నైపై విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు రేపటి మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.