ములుగు కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి డివైడర్ వద్ద యూ-టర్న్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాంగ్ రూట్ కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని గుర్తించారు. జిల్లా రవాణా అధికారి బారాగాడి శ్రీనివాస్ చర్యలు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రోడ్ సేఫ్టీకమిటీ ప్రతిపాదన చేసింది. ఆర్&బీ, పోలీస్, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేశారు.