NRPT: విద్యార్థుల ప్రతిభకు చదువుల పండగ కార్యక్రమం ఒక వేదికగా నిలిచిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. జిల్లాలో ఎఫ్ఎల్ఎన్, ఎస్ఐపీ అమలులో పురోగతి సాధిస్తున్నాయని, ఈ నవకల్పనలు రాష్ట్ర విద్యాశాఖకు దిక్సూచిగా మారాలని ఆయన ఆకాక్షించారు. బుధవారం నారాయణపేటలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన చదువుల పండుగ 2.0 కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.