NZB: ధర్పల్లి మండలం దుబ్బాకలో శనివారం వార సంత వేలంపాట నిర్వహించనున్నట్లు గ్రామకార్య దర్శి సాయికుమార్ శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 10:30 గంటలకు గ్రామంలోని గాంధీచౌక్ ఆవరణలో సర్పంచ్ సమక్షంలో వేలం వేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు గ్రామపంచాయతీ నిర్ణయించిన డిపాజిట్‌ను చెల్లించి వేలంపాటలో పాల్గొనాలన్నారు.