KMR: జిల్లాలో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు నేడు ప్రశాంతంగా జరిగాయి. ఓపెన్ పదో తరగతికి జరిగిన సైన్స్ & టెక్నాలజీ పరీక్షకు 6 పరీక్షా కేంద్రాల్లో 1,008 మందికి గాను 884 మంది హాజరుకాగా 124 మంది గైర్హాజరయ్యారని DEO రాజు వెల్లడించారు. ఓపెన్ ఇంటర్‌కు జరిగిన బిజినెస్ స్టడీస్/కామర్స్ పరీక్షకు 8 పరీక్షా కేంద్రాల్లో 1,050 మందికి గాను 957 మంది హాజరయ్యారు.