NGKL: వేసవి నేపథ్యంలో ప్రజా ఆరోగ్యంపై ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కీలక ఆదేశాలు జారీ చేశారు. అచ్చంపేట ఏరియా ఆసుపత్రి సమీక్షలో పాల్గొన్న ఆయన, ఎండల తీవ్రత దృష్ట్యా ఆసుపత్రుల్లో సరిపడా మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. వడదెబ్బ, డీహైడ్రేషన్ బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.