GDWL: జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో కేజీబీవీ సంక్షేమ వారోత్సవాలను డీఈవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అ. కలెక్టర్ నర్సింగరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను ఈ సందర్భంగా అభినందించారు.