MLG: భారత్ దర్శన్‌లో భాగంగా ఎంసీహెచ్ఆర్డీ శిక్షణాధికారులు వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవాన్ని టూరిజం గైడ్ వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.