NZB : ఎస్సై సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన నీలేద్రీ నాగ్, సిర్పూర్ గ్రామంలోని ఇటుక బట్టీలో పని చేస్తుండగా అకస్మాత్తుగా ఛాతి నొప్పితో కుప్పకూలింది. వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.