మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వానికి జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ సందర్భంలో నేటి ఉదయం నుంచి సమ్మె ప్రారంభం కావడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 డిపోల పరిధిలో 945 బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.