NLG: కేతేపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో మంగళవారం వరికోస్తున్న యంత్రానికి విద్యుత్తు లైన్లు తగలడంతో పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిరంజీవి వరికోత యంత్రం గ్రామ శివారులోని పులుసు లింగస్వామి వరిపొలం కోస్తోంది. ఈ క్రమంలో పైభాగంలో ఉన్న విద్యుత్ లైన్ తీగలు తగిలాయి. మంటలు లేవడంతో అప్రమత్తమైన డ్రైవర్ కిందికి ప్రాణాలు కాపాడుకున్నాడు.